: వెట్టి చాకిరీ ఆరోపణలు అవాస్తవం...నాపై కక్షతోనే అలా చేశారు: ఎస్పీ వివరణ
హోంగార్డులతో వెట్టిచాకిరీ చేయిస్తున్నానంటూ తనపై వస్తున్న వార్తలు అవాస్తవమని రంగారెడ్డి జిల్లా ఎస్పీ నవీన్‌కుమార్ తెలిపారు. మీడియాలో వచ్చిన ఆరోపణలతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సక్రమంగా విధులు నిర్వర్తించమని ఉద్యోగులకు సూచించినందుకే తనపై కుట్ర చేశారని తెలిపారు. ఈ కుట్ర వెనుక అదనపు ఎస్పీ వెంకటస్వామి, సీసీ మహేష్ లు ఉన్నారని ఆయన ఆరోపించారు. తాను సెలవులో ఉన్న సమయంలో క్యాంపు ఆఫీసులో ఆ దృశ్యాలను చిత్రీకరించారని ఆయన చెప్పారు. పశువైద్యాధికారిగా గతంలో పనిచేశానని చెప్పిన ఆయన, పక్షులు, పశువులపై ప్రేమతో వాటిని పెంచుకుంటున్నానని అన్నారు.