: అద్భుతంగా డైవ్‌ క్యాచ్‌లు ప‌డుతూ ప్రాక్టీస్ చేస్తోన్న కోహ్లీ, ధావ‌న్


వెస్టిండీస్ పర్య‌ట‌న‌లో ఉన్న టీమిండియా ఆట‌గాళ్లు సిరీస్ గెలిచి క‌ప్పు కొట్ట‌డ‌మే ల‌క్ష్యంగా ప్రాక్టీసులో మునిగిపోయారు. వెస్టిండిస్‌తో టీమిండియా నాలుగు టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు జులై 21న ఆడ‌నున్న విషయం తెలిసిందే. దానికి ముందు కూడా ప్రాక్టీసు మ్యాచుల్లో ఇరు జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. వెస్టిండిస్‌తో గెలుపే ల‌క్ష్యంగా టీమిండియా ఆట‌గాళ్లు కోహ్లీ, ధావ‌న్ చేస్తోన్న ప్రాక్టీసుకి సంబంధించి ఓ వీడియోను బీసీసీఐ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఈరోజు పోస్ట్ చేసింది. అందులో కోహ్లీ, ధావ‌న్ డైవ్‌ క్యాచ్‌లు పడుతూ నెట్స్‌లో ప్రాక్టీసు చేస్తున్నారు. అద్భుతంగా క్యాచులు ప‌డుతూ కోహ్లీ, ధావ‌న్ ప్రాక్టీస్ చేస్తున్నారని బీసీసీఐ పేర్కొంది. భారత ఫీల్డింగ్‌ కోచ్‌ అభయ్‌ శర్మ విసురుతోన్న బంతుల‌ను కోహ్లీ, ధావ‌న్ ఎగిరి, ఎగిరి ప‌డుతుండ‌డం అభిమానుల‌ను ఆక‌ర్షిస్తోంది.

  • Loading...

More Telugu News