: వైసీపీకి మరో షాక్!... టీడీపీలో చేరికకు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి చర్చలు!


ఏపీలో విపక్షం వైసీపీకి మరో భారీ షాకే తగలనుంది. అధికార పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఇప్పటికే 20 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి ఝలక్కిచ్చి టీడీపీలో చేరిపోయారు. కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి కూడా సైకిలెక్కేశారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి పెను షాకే తగలనుంది. ఆ జిల్లాలోని రాజమహేంద్రవరానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అధికార పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. పూర్వాశ్రమంలో టీడీపీ నేతగానే ఉన్న ఆదిరెడ్డి గడచిన ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిపోయారు. ఆదిరెడ్డి సామాజిక వర్గాన్ని మరింత దగ్గర చేసుకునేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాడు అందివచ్చిన ఒకే ఒక్క ఎమ్మెల్సీ సీటును అందరినీ కాదని ఆదిరెడ్డికి ఇచ్చేశారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆదిరెడ్డి తన సొంత గూటికి చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ మేరకు ఆయన ఓ తెలుగు దినపత్రికకు సదరు సన్నాహాలను ధ్రువీకరించారు కూడా. టీడీపీకి చెందిన దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడుకు వియ్యంకుడైన ఆదిరెడ్డి... రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిల్లాకు చెందిన సీనియర్ నేత గన్ని కృష్ణలు అభ్యంతరం వ్యక్తం చేయకపోతే త్వరలోనే సైకిలెక్కేయడం ఖాయమే.

  • Loading...

More Telugu News