: రికార్డింగ్ డ్యాన్సర్ పై కరెన్సీ నోట్లు కుమ్మరించిన యూపీ పోలీస్!... వీడియో వైరల్!
ఆయనో పోలీసు అధికారి. గుట్టు చప్పుడు కాకుండా జరిగే అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపడం ఆయన విధి. అయితే తనపై ఉన్న ఆ బాధ్యతను ఆ పోలీసు అధికారి మరిచిపోయారు. అసభ్యకర రీతుల్లో జరుగుతున్న రికార్డింగ్ డ్యాన్స్ కు ప్రేక్షకుడిగా హాజరయ్యారు. జుగుప్సాకర భంగిమల్లో నృత్యం చేస్తున్న మహిళా డ్యాన్సర్ ను చూసి మైమరచిపోయారు. ఇంకేముంది, ఓ స్థానిక నేతతో కలిసి నేరుగా వేదిక వద్దకు వచ్చారు. చేతిలోని కరెన్సీ నోట్లను ఆ డ్యాన్సర్ పై కుమ్మరించారు. ఇదీ ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ పోలీసు అధికారి చేసిన నిర్వాకం. యూపీలోని ఏ ప్రాంతంలో, ఎప్పుడు ఈ ఘటన చోటుచేసుకుందన్న వివరాలు తెలియకపోయినా... సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.