: జకీర్ ప్రసంగాలు విని.. ఆ నలుగురు ఐఎస్‌లో చేరాలనుకున్నారు!


ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్ఐఎస్)లో చేరాలనుకుంటున్న యవతకు ఇస్లాం బోధకుడు జకీర్ నాయక్ ప్రసంగాలు స్ఫూర్తినిస్తున్నాయా.. అంటే అవుననే అంటున్నారు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు. పలువురు యువకులు జకీర్ ప్రసంగాలతో స్ఫూర్తి పొంది ఐఎస్‌లో చేరేందుకు వెళ్తున్నట్టు చెబుతున్నారు. ఢాకా ఉగ్రదాడిలో పాలుపంచుకున్న ఉగ్రవాదుల్లో ఇద్దరు తమకు జకీర్ ప్రసంగాలే స్ఫూర్తి అని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో జకీర్‌పై ఓ కన్నేసిన ప్రభుత్వం అతని ‘పీస్’ టీవీ చానల్‌పై నిషేధం విధించింది. మహారాష్ట్ర లోని కళ్యాణ్‌కు చెందిన నలుగురు యువకులకు కూడా జకీర్ ప్రసంగాలే స్ఫూర్తినిచ్చినట్టు తెలుస్తోంది. నలుగురిలో ఒకరైన అరీబ్ మజీద్‌ను గతేడాది ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. తనకు జకీర్ ప్రసంగాలు ఎంతో స్ఫూర్తినిచ్చాయని విచారణలో అతను తెలిపాడు. అలాగే 2010-11లో బిహార్‌లోని దర్భంగాలో పోలీసులు ఇండియన్ ముజాహిదీన్ మాడ్యూల్ గుట్టును రట్టుచేశారు. ఆ సమయంలో పోలీసులు జకీర్ ప్రసంగాల సీడీలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News