: ‘ఆప్’కు మరో ఎదురు దెబ్బ.. ఎమ్మెల్యే తన గుండెలపై కొట్టారంటూ మహిళ ఫిర్యాదు


ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే సీబీఐ దాడులతో ఉక్కిరి బిక్కరి అవుతున్న ఆయనకు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. ఆ పార్టీ ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్ తన గుండెలపై కొట్టారంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎమ్మెల్యేపై వేధింపులు, బెదిరింపుల నేరం కింద కేసు నమోదు చేశారు. గత పదిహేను రోజుల్లో ఇటువంటి సంఘటన జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గత నెల 2న ఆప్ ఎమ్మెల్యే జర్వాల్ తనను భయపెట్టడమే కాకుండా గుండెలపై కొట్టినట్టు దక్షిణ ఢిల్లీలోని సంగం విహార్ ప్రాంతానికి చెందిన మహిళ ఆరోపించారు. నీటి సమస్యపై నిరసన తెలిపేందుకు ఢిల్లీ జల్‌బోర్డు కార్యాలయానికి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగినట్టు పేర్కొన్నారు. ‘‘ఆరోజు మధ్యాహ్నం కార్యాలయం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే తప్పుడు ఉద్దేశంతో నా గుండెలపై కొట్టారు’’ అని ఎఫ్ఐఆర్‌లో ఆమె పేర్కొన్నారు. ఆయన వెళ్తూవెళ్తూ తనను బెదిరించినట్టు ఆరోపించారు. మహిళ ఆరోపణలను జర్వాల్ కొట్టిపడేశారు. నిరాధార ఆరోపణలని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News