: తప్పు బ్యాట్ ది కాదు...పిచ్ ది!: వార్నర్
అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో బరువు, మందం కలిగిన బ్యాట్లపై ఆంక్షలు విధించాలంటూ ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలను ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్ తప్పుపట్టాడు. టెస్టు క్రికెట్లో బౌలర్లు రాణించకపోవడానికి కారణం బ్యాట్లు కాదని అన్నాడు. బ్యాటింగ్ పిచ్ లను రూపొందించడమే బ్యాట్స్ మన్ రాణించడానికి కారణమవుతోందని, ఫ్లాట్ పిచ్ లపై బ్యాట్స్ మన్ వీరవిహారం చేస్తుంటారని, గత కొన్ని టెస్టులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని వార్నర్ వెల్లడించాడు. బ్యాట్ల బరువు, మందానికి బౌలర్లు విఫలమవ్వడానికి లింకు లేదని వార్నర్ స్పష్టం చేశాడు. బౌలర్లకు అనుగుణమైన పిచ్ లు రూపొందిస్తే ఈ సమస్య పరిష్కారమవుతుందని తెలిపాడు.