: కోర్టులో చిన్నారి సానియా హాజరు.. పాపను తమకే అప్పగించాలని సింథియా బంధువుల డిమాండ్
ఐదు రోజుల క్రితం భర్త రూపేశ్ చేతిలో దారుణంగా హత్యకు గురయిన కాంగో దేశస్థురాలు సింథియా కేసులో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కోర్టు ఈరోజు విచారణ ప్రారంభించింది. ప్రధానంగా సింథియా కుమార్తె ఎవరి సంరక్షణలో పెరగాలనే అంశాన్ని కోర్టు నిర్ణయించనుంది. కోర్టులో చిన్నారి సానియాను హాజరుపరచారు. సింథియా బంధువులు కాంగో నుంచి వచ్చి ఆందోళన కొనసాగిస్తోన్న నేపథ్యంలో కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాపను తమకే అప్పగించాలని సింథియా బంధువులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తమ వద్దే ఉంచాలని రూపేశ్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న సానియా మీడియాతో మాట్లాడుతూ తన నానమ్మ దగ్గరే ఉంటానని చెప్పిన సంగతి తెలిసిందే.