: ప్రజా సాధికార సర్వేతో ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లదు: మంత్రి ప్రత్తిపాటి
ప్రజల వివరాలను సమగ్రంగా సేకరించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన ప్రజా సాధికార సర్వే ప్రారంభమైంది. గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సర్వేను ప్రారంభించారు. తన వ్యక్తిగత వివరాలను అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వేపై ప్రజలు ఎటువంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దని అన్నారు. ప్రజా సాధికార సర్వేతో ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లదని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను మరింత చేరువ చేయడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. సర్వే అనంతరం ప్రణాళికను రూపొందించి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని పేర్కొన్నారు.