: ప్రజా సాధికార సర్వేకి శ్రీకారం... వేలి ముద్రలు ఇచ్చి ఇంట్లో వారందరి వివరాలూ చెప్పిన చంద్రబాబు!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజా సాధికార సర్వే నేటి నుంచి ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం నుంచి ఈ సర్వే లాంఛనంగా మొదలైంది. కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నివాసానికి చేరుకున్న సర్వే అధికారులు ఆయన కుటుంబ సభ్యుల వివరాలన్నీ సేకరించారు. ముఖ్యమంత్రి సంయుక్త కార్యదర్శి ప్రధ్యుమ్న, ప్రభుత్వ ఐటీ సలహాదారు జే సత్యనారాయణ, సమచార శాఖ కమిషనర్ వెంకటేశ్వర్లు, కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు, గణాంక సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిబంధనల మేరకు తన వేలి ముద్రల నుంచి, ఆధార్ కార్డు వివరాల వరకూ అధికారులకు తెలిపిన చంద్రబాబు, తన కుటుంబ సభ్యులను వారికి పరిచయం చేసి అన్ని వివరాలూ సమర్పించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడూ ప్రజా సాధికార సర్వేకు సహకరించాలని, దీనివల్ల సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News