: ఇన్ఫోసిస్ స్వాతి హంతకుడు రామ్ కుమార్ కు ఝలక్కిచ్చిన లాయర్!


తాను బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం దక్కాలని పోరాడుతున్న వ్యక్తినని, రామ్ కుమార్ సైతం దళితుడు కావడంతో సహకరించాలని భావించానని, అయితే, రామ్ కుమార్ కోర్టులో మాట మార్చడంతో తాను ఈ కేసు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని న్యాయవాది కృష్ణమూర్తి వెల్లడించారు. రామ్ కుమార్ తరఫున తాను జామీను పిటిషన్ దాఖలు చేయగా ఇతర న్యాయవాదులు తనపై తీవ్ర ఆరోపణలు చేశారని వాపోయారు. ఈ నేపథ్యంలో, ఈ కేసు నుంచి వైదొలగినట్టు ఆయన తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొన్నారు. తన జూనియర్లు సైతం కేసును వాదించబోరని తెలిపారు. కాగా, గత నెల 24న చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టేషనులో ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతిని హత్య చేసిన రామ్ కుమార్, ఆపై వారం రోజుల తరువాత స్వగ్రామంలో పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. తొలుత తానే హత్య చేశానని స్టేట్ మెంట్ ఇచ్చిన రామ్, ఆపై కోర్టులో పోలీసుల బలవంతం వల్ల తాను అలా ఒప్పుకున్నానని వెల్లడించి ఝలక్ ఇవ్వగా, ఇప్పుడు అతని తరఫున వాదనలకు దిగిన కృష్ణమూర్తి అతనికే ఝలక్ ఇవ్వడం గమనార్హం.

  • Loading...

More Telugu News