: జకీర్ నాయక్ పై దర్యాప్తుకు 'మహా' సీఎం ఫడ్నవీస్ ఆదేశం
వివాదాస్పద ప్రసంగాలతో ముస్లిం యువతను తప్పుదోవ పట్టిస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జకీర్ నాయక్ పై దర్యాప్తుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. జకీర్ నాయక్ ప్రసంగాలను పరిశీలించి ఉగ్రవాదంపై ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదిక అందించాలని ఎస్పీని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశించారు. ఆయనకు విదేశాల నుంచి అందుతున్న నిధుల వివరాలు కూడా ఆరా తీయాలని ఆయన ఆదేశించారు. కాగా, ముస్లిం మత ప్రబోధకుడైన జకీర్ నాయక్ ప్రసంగాలకు ఆకర్షితులైన బంగ్లా యువకులు ఐఎస్ఐఎస్ బాటపట్టినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.