: విజయవాడ నుంచి తిరుమల చేరుకున్న గవర్నర్ నరసింహన్
ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ నేటి సాయంత్రం విజయవాడ నుంచి తిరుమల చేరుకున్నారు. ఆయనకు పద్మావతి అతిథిగృహం వద్ద జేఈవో శ్రీనివాసరాజు, ఇతర అధికారులు స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. రేపు వేకువ జామున నిర్వహించే ప్రత్యేకపూజల్లో పాల్గొని, స్వామివారిని దర్శనం చేసుకుని గవర్నర్ హైదరాబాదు చేరుకుంటారు.