: హాలీవుడ్ లో అత్యధిక సంపాదన కలిగిన హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్
'అవేంజర్స్', 'కెప్టెన్ అమెరికా', 'ఐరన్ మ్యాన్' సినిమాలతో కోట్లాది అభిమానులను అలరించిన స్కార్లెట్ జాన్సన్ హాలీవుడ్ లో అత్యధిక ఆదాయం కలిగిన నటిగా గుర్తింపుపొందింది. హాలీవుడ్ లో అత్యధిక సంపాదన కలిగిన హీరోహీరోయిన్ల జాబితాను బాక్సాఫీస్ 'మొజో వెబ్ సైట్' రూపొందించింది. ఈ జాబితాలో టాప్-10 లో నటి స్కార్లెట్ జాన్సన్ మాత్రమే స్థానం దక్కించుకుంది. 3.3 బిలియన్ డాలర్ల సంపాదన (దాదాపు రూ. 22245 కోట్లు) తో ఆమె 10వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో టాప్ 10లో చోటు సంపాదించిన నటీమణి స్కార్లెట్ ఒక్కర్తే కావడం విశేషం. ఈ జాబితాలో 19వ స్థానంలో కేమెరాన్ డియాజ్ నిలిచింది.