: ఉగ్రవాదులకు, ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్న వారికి మతం లేదు: అమీర్ ఖాన్


బంగ్లాదేశ్ లో చోటుచేసుకున్న వరుస ఉగ్రదాడులపై బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్ లో రంజాన్ ను పురస్కరించుకుని ఈద్గాలో ప్రార్థనలు చేసుకుంటున్నవారిపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారని తెలిసిన అమీర్ ఖాన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఘటనను ఖండించాడు. మృతులు, క్షతగాత్రుల బంధువులకు సానుభూతి తెలిపిన అమీర్ ఖాన్, తీవ్రవాదులకు మతం లేదని అన్నాడు. ఉగ్రవాదాన్ని అనుసరించే వారికి, ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్న వారికి మతం ఉండదని అమీర్ పేర్కొన్నాడు. కాగా, రంజాన్ రోజున విలువైన సమయాన్ని తన తల్లితో గడపనున్నానని అమీర్ తెలిపాడు. అమీర్ నటిస్తున్న దంగల్ సినిమా విడుదల కావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News