: నిజాయతీకి అతను మారుపేరు... 1.25 కోట్లు దొరికితే...తిరిగిచ్చేశాడు


కూటికి పేదలైనా గుణంలో మాత్రం కుబేరులుంటారు. అమెరికాలో ఓ టాక్సీ డ్రైవర్ నిజాయతీ బోస్టన్ హీరోను చేసింది. వివరాల్లోకి వెళ్తే... అమెరికాలోని బోస్టన్ నగరంలో ఓ ప్రయాణికుడు నార్తర్న్ యూనివర్సిటీకి వెళ్లాలంటూ ఓ టాక్సీని బాడుగకు మాట్లాడుకున్నాడు. యూనివర్సిటీ వద్ద దిగిన ప్రయాణికుడు యూనివర్సిటీలోకి వెళ్లే హడావుడిలో కార్లోనే బ్యాగు మర్చిపోయాడు. తర్వాత కారు వెనక్కు తిప్పుకుని వెళుతున్న ఆ డ్రైవర్ కొంత సేపటికి వెనుకసీట్లో ఓ బ్యాగును గుర్తించాడు. ఆ బ్యాగులో 1.87 లక్షల డాలర్ల (1.25 కోట్ల రూపాయలు) సొమ్ము ఉండడం చూశాడు. దీంతో తన టాక్సీని నేరుగా పోలీస్ స్టేషన్ కు పోనిచ్చి, ఆ మొత్తాన్ని పోలీసులకు అప్పగించాడు. డ్రైవర్ పోలీస్ స్టేషన్ లో డబ్బు అప్పగించిన కాసేపటికే తన డబ్బు టాక్సీలో మర్చిపోయానంటూ ఓ వ్యక్తి నుంచి పోలీసులకు ఫోన్ వచ్చింది. విచారణ అనంతరం ఆ డబ్బును ప్రయాణికుడికి అందించారు. డ్రైవర్ నిజాయతీ ప్రశంసనీయమని చెప్పిన పోలీసు అధికారులు అతనిని తగిన విధంగా సత్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News