: రంజాన్ రోజున లక్నో ఐష్‌బాగ్ ఈద్గాలోకి మహిళలకు ప్రవేశం.. చారిత్రక విజయమన్న తృప్తీదేశాయ్
రంజాన్ పండుగ సందర్భంగా లక్నోలోని అతి పెద్ద ప్రార్థనాస్థలం ఐష్‌బాగ్ ఈద్గాలోకి ఈరోజు ముస్లిం మహిళలను అనుమతించారు. లింగభేదాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమం సాగుతోన్న వేళ ఈరోజు మహిళలను ఈద్గాలోకి అనుమతించడం శుభపరిణామం. మహిళల ప్రవేశం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి వారిని అనుమతించారు. దీని పట్ల భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తీ దేశాయ్ హర్షం వ్యక్తం చేశారు. 'ఇది చారిత్రాత్మక విజయమని, పెద్ద మార్పు' అని ఆమె అన్నారు. అక్కడి ఈద్గా పెద్దలు మంచి నిర్ణయం తీసుకొని మహిళలను అనుమతించారని, దీన్ని ఆదర్శంగా తీసుకొని ఈ అంశంపై దేశమంతటా మార్పు వస్తే బాగుంటుందని తృప్తీదేశాయ్ పేర్కొన్నారు. ఈద్గా పెద్దలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో లింగభేదం తొలగిపోవాలనే తాను ప్రయత్నాలు కొనసాగిస్తున్నానని ఆమె చెప్పారు.