: చంద్రబాబుపై మండిపడ్డ మోపిదేవి వెంకటరమణ
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై వైఎస్సార్సీపీ నాయకుడు మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. కమీషన్ల కోసమే ‘పట్టిసీమ’ తప్ప, దీంతో, ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదని మోపిదేవి విమర్శించారు.