: వర్షంలో మొక్కలకు నీరు పోసి నవ్వులపాలైన ముంబై మేయర్!
ప్రవీణా ఠాకూర్, ముంబైలోని వాసాయ్ - విరార్ ప్రాంతానికి మేయర్. ఇటీవల నగరంలో గ్రీన్ డ్రైవ్ చేపట్టినందుకు ఆమెపై ప్రశంసల వర్షం కురిసింది. ఇక ఆమె తాజాగా 'మొక్కల పెంపకం' అంటూ చేసిన పని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమెను నవ్వులపాలు చేస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే, ఓ వైపు జోరుగా వర్షం పడుతుంటే, అనుచరగణం గొడుగులతో ఆమెకు రక్షణ కల్పిస్తున్న వేళ, మొక్కలకు నీరు పోస్తూ ఫోటోలకు పోజులిచ్చారు. ఈ ఫోటో ఆన్ లైన్లో ఆమెపై సెటైర్ల మీద సెటైర్లు కురిపిస్తోంది. ఆమె వైఖరిని తిట్టిపోస్తున్నారు. వర్షంలో నీరు పోస్తున్న ప్రవీణ చిత్రాన్ని మీరూ చూడవచ్చు.