: ‘పవర్ ప్లాంట్ మాకొద్దు’.. శ్రీకాకుళం జిల్లా చీడివలసలో గ్రామస్తుల ఆందోళన.. ఉద్రిక్తత
శ్రీకాకుళం జిల్లా పొలాకి మండలం చీడివలసలో ఈరోజు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతంలో సర్వే చేయడానికి వచ్చిన అధికారుల బృందాన్ని థర్మల్ ప్లాంట్ నిర్వాసితులు అడ్డుకున్నారు. దీంతో సర్వే బృందం పోలీసు బందోబస్తు మధ్య తమ సర్వేను కొనసాగించాలని చూసింది. అక్కడకు చేరుకున్న పోలీసులు వారికి రక్షణగా నిలిచి సర్వే కొనసాగించాలని చెప్పారు. ‘పవర్ ప్లాంట్ మాకొద్దు’ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు, గ్రామస్తుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసుల భద్రత మధ్యే సర్వే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.