: జకీర్ నాయక్ కు వ్యతిరేకంగా ముంబైలో ర్యాలీ!... భద్రత కట్టుదిట్టం


భారత వాణిజ్య రాజధాని ముంబైలో నేటి ఉదయం భద్రత కట్టుదిట్టమైంది. వివాదాస్పద ఇస్లామిక్ మత గురువు, ఇస్లామిక్ రీసెర్చి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జకీర్ నాయక్ కు వ్యతిరేకంగా ఆయన కార్యాలయం ముందు నేటి ఉదయం నిరసన ర్యాలీలు మొదలయ్యాయి. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న జకీర్ నాయక్ ను ఆదర్శంగా తీసుకున్న మీదటే ఢాకా దాడిలో పాలుపంచుకున్న ఇద్దరు ఉగ్రవాదులు నరమేధంలో పాలుపంచుకున్నారన్న వార్తలు వినిపించాయి. ఈ విషయంపై నిన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజుతో పాటు శివసేన ఎంపీ అరవింద్ సావంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నేటి ఉదయం ముంబైలోని జకీర్ నాయక్ కార్యాలయం ఎదుట నిరసనలు ప్రారంభమయ్యాయి. దీంతో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయోనన్న భయంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన ముంబైవ్యాప్తంగా నెలకొంది.

  • Loading...

More Telugu News