: సెన్సార్ బోర్డు సభ్యుడిగా సూపర్ స్టార్ అభిమాని!... ఉస్సేనయ్యకు రెండో దఫా దక్కిన అవకాశం!


టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ అభిమాని జేపీ ఉస్సేనయ్యకు అరుదైన అవకాశం దక్కింది. ఇప్పటికే ఓ దఫా ప్రాంతీయ సెన్సార్ బోర్డు సభ్యుడిగా కొనసాగిన ఆయనకు రెండో దఫా కూడా ఆ అవకాశం దక్కింది. రెండేళ్ల పదవీకాలంతో ఆయన రెడో దఫా సెన్సార్ బోర్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు నిన్న ప్రాంతీయ సెన్సార్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. తన సీనియర్ అభిమానికి దక్కిన ఈ అరుదైన అవకాశంతో సూపర్ స్టార్ కృష్ణ ఉప్పొంగిపోయారు. నిన్న తన ఇంటికి ఉస్సేనయ్యను పిలిపించిన కృష్ణ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు కూడా ఉస్సేనయ్యను అభినందించారు.

  • Loading...

More Telugu News