: నల్గొండ జిల్లా కోళ్లఫారంలో భారీగా పేలుడు పదార్థాలు
నల్గొండ జిల్లా నారాయణపురం మండలంలోని మహ్మదాబాద్ గ్రామంలోని లక్ష్మారెడ్డి కోళ్ల ఫారంలో భారీగా పేలుడు పదార్థాలున్నాయన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. నాలుగు బస్తాల అమ్మోనియం నైట్రేట్, జిలెటిన్ స్టిక్స్, విద్యుత్ తీగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి చిట్యాలకు చెందిన శ్రీనివాసరెడ్డి అనే రైతుకు సంబంధించినవిగా భావిస్తున్నారు. పోలీసులు ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించారు.