: ‘సింగపూర్ ప్లాన్’తో అనేక ప్రమాదాలు: ‘అమరావతి'పై పుస్తకంలో విక్రం సోనీ


సింగపూర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం నవ్యాంధ్ర రాజధాని అమరావతిని నిర్మించడం సరైంది కాదని ప్రముఖ రచయిత విక్రం సోనీ అన్నారు. ‘అమరావతి సహజ నగరం’ అనే పేరుతో ఆయన ఒక పుస్తకం రాశారు. నవ్యాంధ్ర రాజధాని ముసాయిదా ప్లాన్ ను, అందులోని లోపాలను ఆయన పుస్తక రూపంలో ఆవిష్కరించారు. ప్రముఖ ఆర్కిటెక్ట్ రోమి ఖోస్లాతో కలిసి ఆయన ఈ పుస్తకాన్ని రాశారు. ఈ సందర్భంగా విక్రం సోనీ మాట్లాడుతూ, సింగపూర్ మాస్టర్ ప్లాన్ వల్ల అనేక ప్రమాదాలు జరగచ్చని, ఒండ్రుమట్టితో నదీ పరీవాహక ప్రాంతంలో నిర్మాణాలు చేపడితే కృష్ణానది ఎడారిగా మారుతుందని, ఈ ప్లాన్ వల్ల భవిష్యత్ లో మంచినీటి సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. సింగపూర్ ప్లాన్ ను ఏ దేశాలూ అమలు చేయడం లేదని, యూరోపియన్ దేశాలు కూడా ఈ తరహా ప్లాన్ కు స్వస్తి చెప్పాయని అన్నారు.

  • Loading...

More Telugu News