: తెలంగాణ కొత్త సచివాలయం.. ‘యు’ ఆకారం ఉండేలా నిర్మాణం


తెలంగాణ కొత్త సచివాలయం ‘యు’ ఆకారంలో ఉండేలా నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఢిల్లీలోని దక్షిణ, ఉత్తర బ్లాక్ ల తరహాలో మంత్రులు, శాఖాధిపతులకు రెండు బ్లాక్ లు, మధ్యలో సీఎం బ్లాక్ ఉండేలా ‘యు’ ఆకారంలో సచివాలయ నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. వాస్తు దోషాలు లేకుండా, దీర్ఘచతురస్రాకార స్థలంలో నిర్మించనున్న ఈ సచివాలయానికి శ్రావణ మాసంలో శంకుస్థాపన చేసి ఏడాదిన్నర కాలంలోగా దీని నిర్మాణం పూర్తి చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం సచివాలయ ప్రాంగణంలో ఉన్న ఆలయాలను రహదారి వైపు తరలిస్తారు.

  • Loading...

More Telugu News