: స్వీట్లు పంచుకున్న భారత్-పాక్ సరిహద్దు సైనికులు
ముస్లింల పండగ రంజాన్ సందర్భంగా భారత్-పాక్ సరిహద్దులోని రెండు దేశాల సైనికులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం స్వీట్లు పంచుకున్నారు. అటారీ-వాఘా సరిహద్దులో బీఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్స్ స్పెక్టర్ జనరల్ జేఎస్ ఒబెరాయ్, పాకిస్థాన్ రేంజర్స్ వింగ్ కమాండర్ బిలాల్ లు సైనికుల సమక్షంలో స్వీట్లు పంచుకున్నారు. కాగా, కొన్ని ప్రాంతాల్లో భక్తి శ్రద్ధలతో రంజాన్ పండగను ఈరోజు జరుపుకోగా, మరికొన్ని ప్రాంతాల్లో రేపు నిర్వహించనున్నారు.