: హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలను భారీ వర్షం ఈరోజు మరోసారి ముంచెత్తింది. వర్షం ధాటికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీరు రోడ్లపైనే నిలిచి ఉండడంతో పలు ప్రధాన కూడళ్లలో స్వల్పంగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. అంబర్ పేట్, కాచిగూడ, విద్యానగర్, రామాంతపూర్ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. చాదర్ ఘాట్, కోఠి, ఆబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్ ప్రాంతాల్లో వర్షం ధాటికి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎర్రగడ్డ ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి.