: థియేటర్లో సినిమా చూస్తూనే తనువు చాలించిన ప్రేక్షకుడు


థియేటర్లో సినిమా చూస్తున్నవాడు చూస్తున్నట్లే చనిపోయిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం, పాములపర్రు గ్రామానికి చెందిన నక్కా రాజబాబు (37) ఉండిలోని సూర్యాథియేటర్ కి మ్యాట్నీ చూసేందుకు వెళ్లాడు. చూస్తున్నవాడు చూస్తున్నట్లే చనిపోయాడు. దీంతో, థియేటర్ యాజమాన్యం ఆ మృతదేహాన్ని బయటపడేసింది. ఈ విషయం తెలుసుకున్న మృతుడి తండ్రి రాములు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కొడుకు మృతిపై అనుమానం వ్యక్తం చేసిన రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.రవివర్మ తెలిపారు.

  • Loading...

More Telugu News