: సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఫ్లెక్సీల తొలగింపు... మున్సిపల్ సిబ్బంది, కాంగ్రెస్ కార్యకర్తల వాగ్వాదం
మెదక్ జిల్లా సంగారెడ్డిలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఫ్లెక్సీల తొలగింపును ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. రేపు జగ్గారెడ్డి పుట్టినరోజు సందర్భంగా సంగారెడ్డిలో ఆయన ఫ్లెక్సీలను భారీగా ఏర్పాటు చేశారు. అయితే, మునిసిపల్ అధికారులు వాటిని తొలగిస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో, వారి మధ్య వాగ్వాదం జరిగింది. కలెక్టర్ ఆదేశాల మేరకే ఆ ఫ్లెక్సీలను తొలగిస్తున్నామని మున్సిపల్ సిబ్బంది పేర్కొన్నారు. అయినప్పటికీ శాంతించని కాంగ్రెస్ కార్యకర్తలు రాస్తారోకోకు దిగారు. ఆందోళనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.