: నిన్న రోడ్డు ప్ర‌మాదంలో గాయప‌డిన గ‌జ‌రాజు ఇక‌లేదు!


రెండు రోజుల క్రితం తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరు సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఏనుగు ఈ రోజు మరణించింది. రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బ‌స్సు ఢీ కొన‌డంతో ప్ర‌మాదానికి గుర‌యిన 10 ఏళ్ల వయసున్న గ‌జ‌రాజుకి రోడ్డుపైనే ప్ర‌థ‌మ‌ చికిత్స అందించి, ప్రత్యేక వాహనంలో తెప్పక్కాడ్ ఎలిఫెంట్ క్యాంప్‌కి తరలించిన సంగతి విదితమే. వైద్యులు గ‌జ‌రాజు కుడి కాలికి, వెన్నెముకకు గాయాలయిన‌ట్లు గుర్తించి చికిత్స అందించారు. అయితే, చికిత్స పొందుతూ ఏనుగు ఈ రోజు మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు మృతి చెందింద‌ని అగికారులు పేర్కొన్నారు. త‌మిళ‌నాడులోనే కాక దేశ వ్యాప్తంగా ఏనుగులు ప్ర‌మాదాల‌కు గుర‌వుతోన్న సంఘ‌ట‌న‌లు ప్ర‌తీరోజు వెలుగులోకి వ‌స్తూనే ఉన్నాయి. త‌మిళ‌నాడులో అనారోగ్యంతో కూడా ఏనుగులు మ‌ర‌ణిస్తున్నాయి. రెండు వారాల వ్య‌వ‌ధిలోనే ఐదు ఏనుగులు ఇలా అనారోగ్యంతో మ‌ర‌ణించాయి.

  • Loading...

More Telugu News