: మోదీకి షాకిచ్చిన అమెరికా!... గ్రోత్ రేటు అంచనా అతిశయోక్తేనని వెల్లడి!


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చాతుర్యాన్ని నిన్నటిదాకా కీర్తిస్తూ సాగిన అగ్రరాజ్యం అమెరికా తన గొంతు మార్చింది. 7.5 శాతం వృద్ధి రేటు సాధిస్తామంటూ మోదీ సర్కారు గొప్పలు చెప్పుకోవడం మినహా... నిర్దేశించుకున్న లక్ష్యాన్ని మోదీ చేరుకోలేరని వ్యాఖ్యానించింది. ఈ మేరకు నిన్న అమెరికా విదేశాంగ శాఖ ‘ఇన్వెస్ట్ మెంట్ క్లైమేట్ స్టేట్ మెంట్స్ ఫర్ 2016’ పేరిట విడుదల చేసిన ఓ నివేదికలో ఈ వ్యాఖ్యలు చేసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాలు ఫరవా లేదని పేర్కొన్న అమెరికా... మిగిలిన విషయాలు, ప్రత్యేకించి ఆర్థిక సంస్కరణల అమలులో మోదీ సర్కారు ఆశించిన మేర వేగంగా చర్యలు చేపట్టడం లేదని తేల్చేసింది. తాను ప్రతిపాదిస్తున్న సంస్కరణలను పార్లమెంటులో ఆమోదింపజేసుకునే విషయంలో మోదీ సర్కారు విఫలమవుతోందని తెలిపింది. భూసేకరణ బిల్లు ఆమోదం విషయంలో చోటుచేసుకున్న పరిణామాలను ఈ సందర్భంగా అమెరికా తన నివేదికలో ఉదహరించింది.

  • Loading...

More Telugu News