: బోయింగ్ విమానాన్ని వెంబడించిన ఫైటర్ జెట్స్


బోయింగ్ విమానాన్ని రెండు ఫైటర్ జెట్ లు వెంబడించిన ఘటన స్విట్జర్లాండ్‌ లో చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌ కు చెందిన 'ఎల్‌ అల్‌' ఎయిర్‌ లైన్స్‌ బోయింగ్‌ 747 విమానం అమెరికాలోని న్యూయార్క్‌ నుంచి ఇజ్రాయెల్‌ లోని టెల్‌ అవివ్‌ నగరానికి బయల్దేరింది. మార్గ మధ్యంలో ఉండగా విమానంలో బాంబు ఉందని అమెరికా అధికారులకు ఫోన్ కాల్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అమెరికా అధికారులు స్విట్జర్లాండ్‌ అధికారులను అప్రమత్తం చేశారు. 9/11 దాడుల అనుమానం వచ్చిన అధికారులు రెండు జెట్ ఫైటర్ విమానాలను రంగంలోకి దించారు. దీంతో విమానం స్విట్జర్లాండ్‌ గగనతలంలోకి ఎంటర్ కాగానే దానిని అనుసరిస్తూ రెండు ఫైటర్ జెట్స్ ప్రయాణించాయి. అయితే టెల్ అవీవ్ వెళ్లిన విమానం ల్యాండ్ అయిన అనంతరం సోదాల్లో ఎలాంటి బాంబు లభ్యం కాకపోవడంతో అది ఆకతాయి బెదిరింపు కాల్ అని తెలిసి హాయిగా ఊపిరిపీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News