: ఏపీ, తెలంగాణ మధ్య మరో వివాదం... ఏపీ తమ అప్లికేషన్ ను కాపీ చేసిందని తెలంగాణ కేసు!


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో వివాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలంగాణలోని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తమ 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్ లైన్' అప్లికేషన్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపీ చేసిందని ఆరోపిస్తూ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము తయారు చేసిన ఆన్ లైన్ అప్లికేషన్ ఫార్మాట్ ను ఏపీ ప్రభుత్వం మక్కీకి మక్కీ తస్కరించిందని ఈ ఫిర్యాదులో అధికారులు తెలిపారు. తమ అప్లికేషన్ ను ఏపీ ప్రభుత్వం కాపీ పేస్టు చేసుకుందని, తెలంగాణ అన్న పదం ఉన్న చోట్ల ఏపీ అని పెట్టుకుందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News