: చిలకలగూడ రైల్వే క్వార్టర్స్‌లో క‌లుషిత‌మైన నీరు.. 40 మంది చిన్నారులు సహా 138 మందికి అస్వ‌స్థ‌త


సికింద్రాబాద్ స‌మీపంలోని చిలకలగూడ రైల్వే క్వార్టర్స్‌లో నీరు క‌లుషిత‌మైంది. ఆ నీటిని తాగ‌డం వ‌ల్ల‌ ఈరోజు 138 మంది అస్వ‌స్థ‌తకు గుర‌య్యారు. మెట్టుగూడ‌లోని రైల్వే ఆసుప‌త్రికి బాధితుల‌ను త‌ర‌లించారు. అస్వ‌స్థ‌త‌కు గుర‌యిన వారిలో 40 మంది చిన్నారులు ఉండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. నీరు క‌లుషితం కావ‌డం ప‌ట్ల బాధితులు, రైల్వే క్వార్టర్స్‌లో నివ‌సిస్తోన్న ఉద్యోగులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నీరు క‌లుషితం అవుతోంద‌న్న అంశంపై తాము అధికారుల‌కు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోలేద‌ని బాధితులు ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News