: కాంగ్రెస్ ఎంపీ నుంచి మోదీ మంత్రివర్గం వరకూ... ఎంజే అక్బర్ అలుపెరుగని పయనం


ఎంజే అక్బర్... ఈ ఉదయం మోదీ మంత్రివర్గంలో సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఓ జర్నలిస్టుగా, రచయితగా, ఆపై రాజకీయవేత్తగా, ఇప్పుడు కేంద్రమంత్రిగా అలుపెరగని ఆయన పయనం ప్రారంభమైంది 1989లో. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ, అక్బర్ లోని ప్రతిభను గుర్తించి బీహార్ లోని కిషన్ గంజ్ నియోజకవర్గం నుంచి బరిలోకి దించారు. ఆనాటి ఎన్నికల్లో అక్బర్ గెలిచారుగానీ, కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. జవహర్ లాల్ నెహ్రూ జీవిత చరిత్రను రాసిన రచయితగా, ఎన్నో ఏళ్లు కాంగ్రెస్ పార్టీ వైపు నిలిచిన ఆయన, 1991లో రాజీవ్ హత్యా నంతరం నెమ్మదిగా రాజకీయాలకు దూరం జరిగి తన ప్రధాన వృత్తి అయిన జర్నలిజంలో దశాబ్దానికి పైగా కొనసాగారు. గుజరాత్ కు మోదీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత, ఆయనకు దగ్గరయ్యారు. ఆపై హిందుత్వ అంశమే ప్రధాన లక్ష్యంగా పయనించే బీజేపీలో చేరారు. బీజేపీలో ముస్లిం వాదనను వినిపించే అతి కొద్ది మంది ప్రధాన నేతల్లో ఒకరిగా ఎదిగి, ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ నుంచి ఎన్నికయ్యారు. ఆయన్ను క్యాబినెట్ లోకి తీసుకోవాలన్న ఆలోచనతోనే మోదీ చాన్స్ ఇచ్చారని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. నేడు ఆ వార్తలు నిజమయ్యాయి.

  • Loading...

More Telugu News