: టీ టీడీఎల్పీ ఆఫీస్ ఇతరులకు కేటాయింపు!... ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి!


హైదరాబాదులోని తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో కొద్దిసేపటి క్రితం కలకలం రేగింది. ఇప్పటిదాకా టీ టీడీఎల్పీ కార్యాలయం కోసం కేటాయించిన రెండు గదులను ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయకుండానే స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఇతరులకు కేటాయించారు. టీ టీడీఎల్పీ కార్యాలయంగా కొనసాగుతూ వస్తున్న ఆ రెండు గదులను అసెంబ్లీ కమిటీలకు కేటాయించారు. దీనిపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తమకు కేటాయించిన గదులను ఇతరులకు ఎలా బదలాయిస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ఎలా స్పందించాలన్న కోణంలో రేవంత్ రెడ్డి న్యాయ నిపుణులతో సమాలోచనలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News