: ఊహించినట్టుగానే అనుప్రియా పటేల్ కు మోదీ క్యాబినెట్లో స్థానం


గుజరాత్ బీజేపీ రాజ్యసభ ఎంపీ మన్సుఖ్ భాయ్ మందావియా చేత కేంద్ర మంత్రిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆపై అందరూ ఆది నుంచి ఊహిస్తున్నట్టుగానే ఎన్డీయే భాగస్వామిగా ఉన్న అప్నాదళ్ ఎంపీ అనుప్రియా సింగ్ పటేల్ తో రాష్ట్రపతి ప్రమాణం చేయించారు. యూపీలోని మీర్జాపూర్ ఎంపీగా గెలిచిన అనుప్రియా పటేల్ ను మోదీ తన క్యాబినెట్ లోకి తీసుకుంటారని చానాళ్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అనంతరం రాజస్థాన్ రాష్ట్రంలోని నాగౌర్ బీజేపీ ఎంపీ సీఆర్ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. ఆపై రాజస్థాన్ కే చెందిన పాలీ నియోజకవర్గ బీజేపీ ఎంపీ పీపీ చౌదరి, మహారాష్ట్రలోని ధూలే బీజేపీ ఎంపీ శుభాష్ రామ్ రావ్ భామ్రేలతో ప్రణబ్ ముఖర్జీ ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ముగిసింది.

  • Loading...

More Telugu News