: ప్రకాశ్ జవదేకర్ కు ప్రమోషన్... అహ్లూవాలియాకు స్థానం
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా, భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నూతన కేంద్ర మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత ప్రకాశ్ కేశవ్ జవదేకర్ తో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో ఆయనకు క్యాబినెట్ మంత్రిగా ప్రమోషన్ లభించినట్లయింది. ఆపై సహాయమంత్రిగా మధ్యప్రదేశ్, మాండ్లాకు చెందిన బీజేపీ ఎంపీ ఫగ్గస్ సింగ్ కులస్తేతో ప్రమాణం చేయించారు. పశ్చిమ బెంగాల్, డార్జీలింగ్ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఎస్ఎస్ అహ్లూవాలియా కేంద్రమంత్రిగా ప్రమాణం చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ ఎంపీ, భాజాపా నేత రమేష్ చందప్ప జిగజినాగితో సహాయ మంత్రిగా ప్రణబ్ ప్రమాణస్వీకారం చేయించారు. మంత్రుల ప్రమాణ స్వీకారాలు కొనసాగుతున్నాయి.