: కేశినేని, బుద్ధాలకు చంద్రబాబు క్లాస్!
చాలా చిన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు అనవసర రాద్ధాంతంతో రచ్చ చేశారని అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డట్టు తెలుస్తోంది. విజయవాడలో రహదారుల విస్తరణలో భాగంగా తొలగించిన గుడుల అంశంలో సున్నితంగా వ్యవహరించకుండా బీజేపీ నేతలపై విరుచుకుపడిన కేశినేని నాని, బుద్ధా వెంకన్నలకు ఆయన క్లాస్ పీకారని పార్టీ వర్గాల సమాచారం. మీ వ్యక్తిగత విభేదాల వల్లే సమస్యను పెద్దది చేశారని, మిత్రపక్షం నుంచి విమర్శల దాడి పెరగడానికి కారణమయ్యారని, ఎవరిష్టానికి వారు ప్రవర్తిస్తూ పార్టీకి చెడ్డపేరు తెస్తుంటే సహించబోనని హెచ్చరించినట్టు సమాచారం. వెంటనే స్థానికులను శాంతింపజేయాలని, మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాగా, ఆలయాల తొలగింపు అంశం పెనుదుమారంగా మారగా, నిన్న పలువురు పీఠాధిపతులు సమావేశమై చంద్రబాబు ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే.