: సొంత జిల్లాకు నేడు వైఎస్ జగన్!... నాలుగు రోజులు అక్కడే!


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తన సొంత జిల్లా కడపకు బయలుదేరనున్నారు. నిన్న పార్టీ విస్తృత సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యక్రమాలకు సంబంధించి దిశానిర్దేశం చేసిన జగన్... నేడు తన సొంత జిల్లా పర్యటనకు బయలుదేరుతున్నారు. నేటి నుంచి నాలుగు రోజుల పాటు కడప జిల్లాలోనే ఉండనున్న జగన్... జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ నెల 8న తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున ‘గడపగడపకూ వైసీపీ’ కార్యక్రమానికి కడప జిల్లా నుంచే ఆయన శ్రీకారం చుట్టనున్నారు.

  • Loading...

More Telugu News