: యూపీ ప్రచార బాధ్యతలకు ఓకే చెప్పిన ప్రియాంకా గాంధీ!


కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కల ఫలించింది. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రచార బాధ్యతలను మోసేందుకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూతురు ప్రియాంకా గాంధీ వాద్రా దాదాపుగా అంగీకరించారు. క్రమంగా తగ్గుతున్న పార్టీ ప్రాభవం నేపథ్యంలో యూపీ ఎన్నికల ప్రచార బాధ్యతలను ప్రియాంకా గాంధీ స్వీకరించాల్సిందేనని ఇటు కార్యకర్తలతో పాటు అటు అదిష్ఠానం కూడా వాదించాయి. అంతేకాకుండా ప్రియాంకా నుంచి గ్రీన్ సిగ్నల్ రాకముందే ప్రచారంలో భాగంగా ఇటీవల పార్టీ షెడ్యూల్ ను రూపొందించింది. దాదాపు 150 ర్యాలీల్లో ఆమె పాలుపంచుకునేలా రూట్ మ్యాప్ ఇప్పటికే సిద్ధమైపోయింది. పార్టీ అవసరత, కార్యకర్తల అబీష్టం మేరకు యూపీ ఎన్నికల ప్రచార బాధ్యతలను స్వీకరిచేందుకు ప్రియాంకా గాంధీ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

  • Loading...

More Telugu News