: ఎఫ్డీఐల ద్వారా ఉగ్రవాదుల డబ్బులు పెట్టుబడులుగా వస్తున్నాయి: సీపీఐ నారాయణ


ఎఫ్డీఐల ద్వారా దేశంలోకి ఉగ్రవాద డబ్బులు పెట్టుబడులుగా వస్తున్నాయని సీపీఐ నేత నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, విదేశీ పెట్టుబడులు ఆహ్వానించి దేశాన్ని తాకట్టు పెడుతున్నారని అన్నారు. అమెరికాతో దేశానికి ఎప్పటికైనా ముప్పేనని ఆయన చెప్పారు. బీజేపీ మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో చట్టప్రకారం న్యాయమూర్తుల కేటాయింపులు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు చర్చించుకుని హైకోర్టు విభజన సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News