: జూబ్లీహిల్స్ లో టీడీపీ నేత కంభంపాటి అక్రమ కట్టడాన్ని కూల్చేసిన జీహెచ్ఎంసీ
తెలుగుదేశం పార్టీ నేత కంభంపాటి రామ్మోహన్ రావుకు చెందిన అక్రమ కట్టడాన్ని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులు కొద్దిసేపటి క్రితం కూల్చేశారు. రోడ్ నంబర్ 17లో కంభంపాటి కట్టడం ఉండగా, పోలీసుల బందోబస్తు మధ్య దాన్ని కార్పొరేషన్ సిబ్బంది కూలగొట్టారు. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించామని, ఈ భవంతిని కూల్చేందుకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. కట్టడాన్ని కూల్చివేసే సమయంలో కంభంపాటి అనుచరులు వాగ్వాదానికి దిగగా, పోలీసులు వారిని చెదరగొట్టారు.