: బాబు పాలనపై వైకాపా సర్వే... వంద ప్రశ్నల ప్రజా బ్యాలెట్!


రాష్ట్రంలో చంద్రబాబునాయుడి ప్రభుత్వ పాలన ఎలా సాగుతోందన్న విషయాన్ని ప్రజల నుంచి తెలుసుకునేందుకు 100 ప్రశ్నలతో రూపొందించిన ప్రజా బ్యాలట్ ను తయారు చేశామని వైకాపా వెల్లడించింది. దీన్ని ఇంటింటికీ అందించి, బాబు పాలనపై అభిప్రాయాన్ని సేకరించనున్నట్టు ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. 8వ తేదీన గడప గడపకూ వైసీపీ కార్యక్రమం నిర్వహించనున్నామని తెలిపారు. ఈ ప్రజా బ్యాలెట్ లో ప్రతి ప్రశ్నకు 'అవును', 'కాదు' అన్న ఆప్షన్లుంటాయని, దానికి సమాధానం ఇస్తే సరిపోతుందని వివరించారు. నియోజకవర్గ ఇన్ చార్జ్ లకు బ్యాలెట్ పేపర్లను ఇస్తామని, 5 నెలల్లో అభిప్రాయ సేకరణను పూర్తి చేస్తామని తెలిపారు. గత రెండేళ్లలో తమ పార్టీ చేసిన ప్రజా పోరాటాలపై ప్రజలకు వివరించి చెబుతామని అన్నారు. 8న మహానేత వైఎస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని పెద్దిరెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News