: నరేంద్ర మోదీకి సాయపడి తప్పుచేశాను... మోసపోయా!: రాంజఠ్మలానీ సంచలన వ్యాఖ్య
విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తెప్పించే చర్యలు చేపడతానని చెప్పి ఆపై విఫలమైన నరేంద్ర మోదీకి సాయపడి తప్పు చేశాననిపిస్తోందని ప్రముఖ న్యాయవాది, ఆర్జేడీ ఎంపీ రాంజఠ్మలానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీని నమ్మి మోసపోయినట్టు తెలిపారు. 'సమాజ్ వాదీ సింథి' సభలో ప్రసంగించిన ఆయన, మోదీ ప్రధాని కావడానికి తానెంతో కృషి చేశానని వివరించారు. ఆయన తన హామీలను నెరవేర్చుకోలేడన్న సంగతి ఇప్పుడు తెలిసిపోయిందని అన్నారు. "నేను మోసపోయినట్టుగా భావిస్తున్నాను. మోదీకి సాయపడినందుకు బాధపడుతున్నా. మీరెవరూ మోదీని నమ్మవద్దని చెప్పేందుకే నేను ఇక్కడికి వచ్చాను" అని అన్నారు. అంతకుముందు మరో ఎంపీ అమర్ సింగ్ మాట్లాడుతూ, ఎల్లప్పుడూ న్యాయం వైపునే నిలిచే జఠ్మలానీ అంటే తనకెంతో గౌరవమని అన్నారు.