: వెస్టిండీస్ పర్యటన ముందు రవిచంద్రన్ అశ్విన్‌కి గాయం
మరో రెండు రోజుల్లో టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరనున్న సంగతి తెలిసిందే. అయితే, పర్యటనకు వెళ్లే ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే ఆధ్వర్యంలో భారత టెస్టు జట్టు క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తుండగా కీలక బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ గాయపడ్డాడు. ప్రాక్టీస్ చేస్తుండగా అశ్విన్ కుడిచేతికి గాయమయినట్లు తెలుస్తోంది. దీంతో ట్రయినింగ్ సెషన్ నుంచి అతడిని తప్పించారు. స్పిన్ మాయాజాలంతో అద్భుతంగా రాణిస్తోన్న అశ్విన్ వెస్టిండీస్ గడ్డపై జరుగనున్న టోర్నీల్లో కీలక పాత్ర పోషిస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు. రెండ్రోజుల్లో వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరుతారనగా అశ్విన్ ఒక్కసారిగా గాయం పాలవడం టీమిండియా అభిమానులను నిరూత్సాహపరిచే అంశమే. వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా రెండు వార్మప్ మ్యాచ్‌లతో పాటు 4 టెస్టులను ఆడనుంది. వార్మప్ మ్యాచ్‌ల అనంతరం జులై 21 నుంచి టెస్టు మ్యాచులు ప్రారంభం అవుతాయి.