: ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఛాంబర్‌లోకి దూసుకెళ్లి అక్కడే బైఠాయించిన ఏబీవీపీ కార్యకర్తలు
హైదరాబాద్‌లోని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయం వద్ద ఈరోజు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంజినీరింగ్ కాలేజీల్లో పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువుకోలేనంత అధికంగా ఫీజులను పెంచేశారని నిరసన తెలుపుతూ ఆ కార్యాలయాన్ని ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు. కార్యాలయం మెయిన్ గేట్ వద్ద బైఠాయించారు. కొందరు కార్యకర్తలు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఛాంబర్‌లోకి దూసుకెళ్లారు. ఛాంబర్ లోనే బైఠాయించారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్‌కి తరలించారు.