: ఏడాదిలో ముగించండి: రోజా కేసుపై హైకోర్టును ఆదేశించిన సుప్రీం


నగరి శాసనసభ్యురాలు, వైకాపా నేత రోజాను ఎమ్మెల్యే పదవికి అనర్హురాలిగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు తన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సుప్రీంకోర్టు వరకూ అవసరం లేదని, హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్ కు సూచించింది. ఈ కేసులో ఎమ్మెల్యే రోజా వివరణ తీసుకోవాలని హైకోర్టును ఆదేశిస్తూ, ఏడాదిలోగా కేసు విచారణను ముగించి తీర్పివ్వాలని పేర్కొంది. తన ఆస్తిపాస్తుల విషయంలో రోజా తప్పుడు సమాచారం ఇచ్చారని చెబుతూ, ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News