: రోజా భవితవ్యం ఏమిటో?... నగరి ఎమ్మెల్యే ‘ఎన్నిక’పై నేడు సుప్రీంలో విచారణ!
వైసీపీ ఫైర్ బ్రాండ్, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా భవితవ్యంపై నేడు మరోమారు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. వివరాల్లోకెళితే... గడచిన ఎన్నికల్లో నగరి నుంచి బరిలోకి దిగిన రోజా ఎన్నికల కమిషన్ కు అందజేసిన అఫిడవిట్ లో ఆమె ఆస్తుల్లో తేడాలున్నాయని రాయుడు అనే వ్యక్తి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్ కు తప్పుడు సమాచారం ఇచ్చిన రోజా ఎన్నికను రద్దు చేయాలని ఆయన తన పిటిషన్ లో కోర్టును కోరారు. దీనిపై స్పందించిన రోజా... సదరు పిటిషన్ ను విచారణను నిలుపుదల చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు దానిపై నేడు కీలక విచారణ చేపట్టనుంది.