: దేశంలోనే చంద్రబాబు నెంబర్ వన్ నేత!: పరిటాల సునీత కామెంట్
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై ఆ పార్టీ నేతలు, ఆయన కేబినెట్ లోని మంత్రులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో నిన్న జరిగిన రంజాన్ తోఫా పంపిణీకి హాజరైన ఆ పార్టీ సీనియర్ నేత, పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఆసక్తికర కామెంట్స్ చేశారు. దేశంలోనే చంద్రబాబు నెంబర్ వన్ నేతగా ఎదిగారని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా చంద్రబాబు అమలు చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఏపీలో ఏ ఒక్క సీఎంకు కూడా రాని ఆలోచనలు చంద్రబాబుకు వస్తున్నాయని కూడా ఆమె అన్నారు.